చౌటుప్పల్ సమావేశంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 08(జనం సాక్షి)
మునుగోడు ఉప ఉన్నికలో బాగంగా చౌటుప్పల్ మండలం,మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకులు,ఇంచార్జ్ లు,కార్యకర్తలతో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే శనివారం సమావేశం నిర్వహించారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని ఎమ్మెల్యే నరేందర్ కోరారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని అన్నారు. ఎమ్మెల్యే,చౌటుప్పల్ ఇంచార్జ్ స్థానిక కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.