ఛలో కరీంనగర్… అందరూ ఆహ్వానితులే..


తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఫంక్షన్ హాల్, 10 సెప్టెంబరు ఆదివారం, ఉదయం 10:30 గంటలకు, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా..

#ముస్లిం డిక్లరేషన్ ఆవిష్కరణ & సంకల్ప సభ జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం జేఏసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సయ్యద్ రసూల్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ సయ్యద్ అజ్గర్ హుస్సేన్. మరియు కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “ఆదివారం జరిగే ఈ సభకు ముఖ్య అతిథులుగా ముస్లిం జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు ప్రొ. మహమ్మద్ అన్సారీ, ఖాలీదా పర్వీన్, సలీమ్ పాష, స్కైబాబ, సయ్యద్ నవాజ్ తదితరులు హాజరవుతున్నారు. కావున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముస్లిం సోదరీ సోదరులందరూ భారీగా ఈ సభకు హాజరయి, మన హక్కుల సాధన కోసం ఐక్యంగా నిలబడదాము” అని కోరారు.