జంటనగరాల్లో చాలాచోట్ల భారీవర్షం
వీలైనంత వరకు బయటకు రావద్దు: పోలీసులు
హైదరాబాద్ :జంటనగరాల్లో చాలాచోట్ల భారీవర్షం కారణంగా పరిస్థితి ఘోరంగా ఉందని, అందువల్ల సాధ్యమైనంత వరకు ఇళ్లనుంచి బయటకు రావొద్దని, ఏమాత్రం వీలున్నా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఎలర్టులు ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాళ్లు తెలిపిన విషయాల్లో కొన్ని ఇలా ఉన్నాయి…
- రోడ్ నెం.12 బంజారాహిల్స్‌లో శ్మశానం వద్ద పెద్ద గోతులు పడ్డాయి
- మాసాబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ చివర మహావీర్ ఆస్పత్రి వద్ద పరిస్థితి కూడా బాగోలేదు
- బంజారాహిల్స్ శాంతిభద్రతల ఔట్‌పోస్టు వద్ద అపోలో ఆస్పత్రి నుంచి విజయా బ్యాంకు వెళ్లే దారిలో భారీ చెట్టు కూలిపోయింది
- కేబీఆర్ పార్కు నుంచి భారీగా వర్షపు నీరు బయటకు వస్తోంది. దాంతో జూబ్లీహిల్స్ వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
- గాంధీభవన్ వద్ద నీరు నిలిచిపోయింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వైపు ట్రాఫిక్ మందగమనం
- నిమ్స్ ఆస్పత్రి ఎదురుగా భారీగా నీలిచిన నీరు. రోడ్డుకు అవతలివైపు నుంచి వెళ్తున్న వాహనాలు
- భారీవర్షాల కారణంగా మలక్‌పేట గంజ్ గేట్ నెం.1 వద్ద రోడ్డు మొత్తం పాడైంది. మలక్‌పేట గంజ్ నుంచి అక్బర్ బాగ్ వైపు ట్రాఫిక్ మళ్లింపు
- పురానాపూల్ – జియాగూడ రోడ్డులో ఓ ఇంటి గోడ కుప్పకూలి రోడ్డుపై పడింది. ఆ మార్గాన్ని వదిలిపెట్టాలి