జంటనగరాల్లో రంగవల్లుల వేడుక
ఇళ్లముందు పల్లెక్రాంతి
పోటీపడి ముగ్గులేసిన ఆడపడచులు
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): గ్రామాలకు వెళ్లినవారు వెళ్లగా హైదరాబాద్‌లో ఉన్న వారు పండగ వేడుకల్లో పాల్గొనడంతో జంగనగరాల్లోనూ సందడి కనిపించింది. ఉదయమే పలుకానల్లో రంగవల్లులు, గొబ్బెమ్మలు అందంగా దర్శనమిచ్చాయి. లోగిళ్ల ముందు ముత్యాల ముగ్గులు పలుకరిస్తున్నాయి.ఇప్పటికే చాలామంది నగరవాసులు సొంతూళ్లలో బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు ప్లలెబాట పట్టారు. ఇక్కడే ఉన్నవారు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. రెండు మూడు రోజులుగా ప్రతి ముంగిటా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ముంగిళ్లలో తీర్చిదిద్దిన రంగవల్లికలు.. ముచ్చటగా కనిపించే గొబ్బెమ్మలతో చాలా ముందుగానే సంక్రాంతి వచ్చిందా అనిపించింది. సంక్రాంతి… పది రోజులు ముందుగానే.. ప్లలెల్లో పండుగ మొదలవుతుంది. ఉదయం, సాయంత్రం.. ఇంటిముందు కళ్లాపి చల్లి… అందమైన ముగ్గులు వేస్తారు. ఆవుపేడతో గొబ్బెమ్మలు చేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. గ్రామాల్లో ఆవులు, గేదెలు ఉంటాయి కాబట్టి పేడకు కొదవ ఉండదు. సిటీలో పేడరంగులాంటి పౌడర్‌తో కల్లాపి చల్లి రంగవల్లులు వేశారు. సంక్రాంతి శుభాకాంక్షల అందులో మెరిశాయి. భోగి మంటలకు పిడకలు, గొబ్బెమ్మలకు కూడా అంతారెడీమేడ్ వ్యవహారాలే నడిచాయి. హరిదాసుల పాటలు. గంగిరెద్దుల ఆటలు.. సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతున్న చిన్నారులతో సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుంది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఒక్కచోటకు చేరి రంగవల్లికలు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలకు భోగిపండ్లు పోస్తూ సంబరాలు చేసుకున్నారు. పలు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు వేడుకల ఏర్పాటు చేసారు. వేషధారణలు, ముత్యాల ముగ్గుల పోటీలు పెడుతున్నారు. సంప్రదాయ పిండివంటలను రుచి చూపుతున్నారు. తెల్లవారుజామునే.. భోగిమంటలు వేసి.. కొత్త సరదాలను ఆస్వాదించారు. ఇక సంప్రదాయ పిండివంటలు చేసి అమ్మే షాపులు కిటకిటలాడాయి. ప్లలెలను గు చేసే చేతి వంటలను చెంతకు చేర్చే ఎన్నో షాపులు నగరవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. పండుగ సందర్భంగా నగరంలోని కొన్ని ¬టళ్ల నిర్వాహకులు సంక్రాంతి ప్రత్యేక ఆహారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పులి¬ర, నాటుకోడికూర, పప్పుచారు, అరిసెలు, బందరు లడ్డు, బూందీ లడ్డు, పెరుగు ఆవడలను అందిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించేందుకు రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. రిసెలు, బొబ్బట్లు, కజ్జికాయలు, జంతికలు, గవ్వలు, చెక్కలు, సున్నుండలు, పూతరేకులను ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నారు.వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. వివిధ కారణాల వల్ల సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కడ ఉండిపోయారు.