జంట జలాశయాలపై మూడో కన్ను
హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి
హైదరాబాద్,మే 24(జనంసాక్షి):
జంట నగరాలకు ప్రధాన మంచినీటి వన రులైన ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ ల దగ్గర కొత్తగా పోలీ స్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండే ఈ పోలీస్ స్టేషన్లను ¬ంమంత్రి నాయిని న ర్సింహారెడ్డి ప్రారంభించారు. శాసన మం డలి చైర్మన్ స్వామిగౌడ్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, జలమండలి ఎం.డి జగదీ శ్వర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునం దన్ ఈ కార్యక్రమానికి హాజర య్యా రు.జంట జలాశయాల దగ్గర పటిష్ట భద్ర త కోసం లేక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్ కు 16 మంది సిబ్బందిని కేటాయించిన్రు. అలాగే 24్ఖ7 పెట్రోలింగ్ కొరకు రెండు వాహనాలను సమకూర్చిన్రు.తెలంగాణ పోలీసులు దేశా నికే ఆదర్శంగా నిలిచిన్రని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. రాజేంద్రనగర్ పరి ధిలోని 18 గ్రామాలకు స్వచ్ఛమైన మం చినీరు సరఫరా చేస్తామని ఈ సంద ర్భంగా ప్రకటించారు. హైదరాబాద్ బ్రాం డ్ ఇమేజ్ కు భంగం కలగకుండా తెలం గాణ ఉద్యమాన్ని నడిపించినమని హరీష్ గుర్తుచేశారు. పోలీసులు
తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే సమాజ సేవలో భాగస్వాములవుతున్నరని ప్రశంసించారు. జంట జలాశయాల శత వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని మంత్రి హరీష్ రావు చెప్పారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జంట జలాశయాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తామన్నారని, వీటిలోకి నీరు వచ్చే నాలాలను అభివృద్ది చేస్తున్నామని హరీష్ రావు వెల్లడించారు. ఇందులో భాగంగా జలాశయం పక్కనే ఉన్న చెరువులో మిషన్ కాకతీయ పనులను మంత్రి ప్రారంభించారు.
చెరువులను కాపాడుకోవాలంటే ఆ గ్రామ ప్రజల సహకారం తప్పనిసరి అన్నారు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్. ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉన్న కిస్మత్ పుర బ్రిడ్జిని మంజూరు చేసిన మంత్రి హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ పోలీసులు సమాజ సేవలో ముందున్నారని ¬ం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీయం కేసిఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ¬ం మంత్రి చెప్పారు.
జంట జలాశయాల చుట్టూ ఉన్న ఎఫ్.టి.ఎల్ ను కాపాడాలని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. వేరే ప్రాంతం నుండి వచ్చిన వారు జంట జలాశయాల చుట్టూ స్థలాలను ఆక్రమించుకున్నరని ఆయన చెప్పారు. వీటిని అభివృద్ది చేయాలని మంత్రి హరీష్ రావును కోరారు.