జంతర్‌ మంతర్‌ వద్ద మార్మోగినజై తెలంగాణ


తెలంగాణ ఇకనైనా ప్రకటించండి
ముల్కీ అమరుల స్ఫూర్తితో
సెప్టెంబర్‌ 30న ధూంతడాఖా చూపెడతాం
జేఏసీ చైర్మన్‌ కోదండరాం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని ఇకనైనా ప్రకటించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ముల్కీ అమరుల స్పూర్తితో తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ సాధనకు ముల్కీ అమరులే స్పూర్తి అన్నారు. సెప్టెంబర్‌ 30న తెలంగాణ సత్తా చాటుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధూంతడాఖా చూపెడతామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్ష బలంగా ఉందని, దాన్ని గౌరవించి ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి వెంటనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. ఇప్పటికే వివిధ ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని, ప్రభుత్వం స్పందించక పోతే భారీ ఉద్యమం తప్పదని కోదండరాం హెచ్చరించారు. ఇప్పటికే మిలియన్‌ మార్చ్‌, సహాయ నిరాకరణ తదితర ఆందోళనలతో ప్రభుత్వాన్ని స్తంభింపజేశామని గుర్తు చేశారు. మరోమారు ప్రభుత్వాన్ని స్తంభింపజేసేందుకు సెప్టెంబర్‌ 30న తెలంగాణa మార్చ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. సంప్రదింపుల పేరుతో జాప్యం చేస్తున్న కేంద్రం మెడలు వంచేలా ఈ కార్యక్రామాన్ని దిగ్విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసి మరోమారు తెలంగాణ ప్రజల ఐక్యత చాటాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని, బేషరతుగా తాము మద్దతిస్తామని స్పష్టం చేసింది. డిసెంబర్‌ 9 నాటి ప్రకటన మేరకు రాష్టాన్న్రి ఏర్పాటు చేయకుంటే.. కాంగ్రెస్‌ భూస్థాపతం కావడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర సాదన కోసం బీజేపీ రాష్ట్ర కిషన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ‘తెలంగాణ పోరు దీక్ష’ సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగనున్న కిషన్‌రెడ్డి దీక్షను పార్టీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించారు. తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదాండరాం, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలో మూడు రాష్టాల్రు ఇచ్చిన ఘతన తమదేనని చెప్పారు. ప్రజాస్వామ్యబద్దమైన తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ప్రభుత్వంపైనా ఉందన్నారు. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమమని కొనియాడారు. న్యాయమైన ఉద్యమానికి బీజేపీ తొలి నుంచీ మద్దతు పలుకుతూ ఉందన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ హావిూని నెరవేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.