జగన్‌పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనను నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. జగన్‌పై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. నమ్మకం ద్రోహం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది. ఐసిసి 409సెక్షన్‌ జగన్‌కు వర్తించదని కోర్టు తెలిపింది. దాల్మియా సిమెంట్స్‌ ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.