జగన్ పాలనలోనే మహిళా సాధికారత
మహిళలకు పదవులతో గౌరవం ఇచ్చిన ఘనత
మహిళా దినోత్సవ వేడుకల్లో తానేటి వనిత
జగన్‌తోనే మహిళలకు గౌరవం పెరిగిందన్న రోజా
అమరావతి,మార్చి8(జనం సాక్షి): మహిళలకు సీఎం జగన్ పాలనలో ప్రత్యేకత ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దేశాధినేతలు, కార్పొరేట్, వాణిజ్య, క్రీడా రంగాలలో, సామాన్య కుటుంబంలో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. జగనన్న అనే పదం సర్వసాధారణంగా మారిందన్నారు. అన్న అంటే అమ్మలో సగం, నాన్నలో సగమన్నారు. ఇంకా తానేటి వనిత మాట్లాడుతూ.. ‘మహిళ నిర్ణయాలు తానే తీసుకునే స్ధాయికి ఎదగడం సాధికారత. మహిళలను లక్షాధికారులుగా చూడాలని రాజశేఖరరెడ్డి కల కన్నారు. తండ్రి కలను కొడుకు సీఎం జగన్ నెరవేర్చుతున్నారు. దిశ చట్టం కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంది. దిశ యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. మహిళలను మంత్రులుగా చేశారు. మన రాష్ట్ర కేబినెట్ నుంచి మహిళా సాధికారత మొదలైంది. మహిళలకు 60శాతం పదవులిచ్చిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. మహిళలు జై జగన్ అంటే నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలి అంటూ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఉద్విగ్నంగా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మహిళ నేడు ఆత్మాభిమానంతో జీవిస్తోందన్నారు. సీఎం జగన్ నేడు మహిళా సాధికారతకు అవకాశం కల్పించారన్నారు. తన 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రోజు ఆనందంగా మాట్లాడుతున్నానన్నారు. ఎందరో నాయకులు వచ్చి వెళ్ళారు. వారెవరికీ సాధ్యం కాని సాధికారత సీఎం జగన్ చేసి చూపించారని అన్నైఆరు. మహిళలు గతంలో పోలీసుల దెబ్బలు తినేవారు. ఏ మహిళా సంఘం పోరాడకుండా మహిళలకు పట్టం కట్టారని అన్నారు. సీఎం జగన్ మహిళా సంక్షేమ మహా చక్రవర్తి అంటూ కీర్తించారు. చంద్రబాబు టీమ్‌కి జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా? నారావారి నరకాసుర పాలన మహిళలందరూ గమనించారు. లోకేష్ ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో మహిళలతో డేన్స్ లేశారు. లోకేష్ పీఏ మహిళలను వేధింపులకు గురిచేశారు. దేవినేని ఉమ తన పదవి కోసం వదినని చంపారు. బోండా ఉమ తల్లిని కొట్టాడు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహిళను బూటు కాలితో తన్నాడు. 160 సీట్లతో టీడీపీ గెలుస్తుందని అచ్చన్న జోకేశాడు‘ అని పేర్కొన్నారు