జగన్‌ రాజకీయ ముసుగు తొలగిపోయింది

– కేసీఆర్‌ మద్దతు జగన్‌కే.. ¬దాకు కాదు
– కుట్రలతో ఏపీని అబాసుపాలు చేయాలని చూస్తున్నారు
– ప్రజలే ఓటుద్వారా వైకాపా అభ్యర్థులకు గుణపాఠం చెబుతారు
– తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌
అమరావతి, మార్చి26(జ‌నంసాక్షి) : కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న రాజకీయ ముసుగు తొలగిపోయిందని తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేందప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఆయన అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రత్యేక ¬దాకు కేసీఆర్‌ మద్దతు ఇవ్వలేదని, ఆయన మద్దతిచ్చింది కేవలం జగన్‌కు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఏపీకి ¬దా కోసం పక్క రాష్ట్ర సీఎంగా కేసీఆర్‌ మద్దతిస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరం అని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రత్యేక ¬దాకు కేసీఆర్‌ మద్దతు పలుకుతున్నారని జగన్‌ అంటున్నారు. ఇటీవల సోనియా తెలంగాణ వచ్చి ¬దాపై మాట్లాడితే కేసీఆర్‌ హెచ్చరించలేదా? విభజన హావిూలన్నీ కాంగ్రెస్‌ నెరవేరుస్తుందని చెబితే కేసీఆర్‌, హరీశ్‌రావు విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ¬దా విషయమై ఎంపీ కవిత, సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. పోలవరానికి వ్యతికరేకంగా తెరాస నేతలు కేసులు వేశారని గుర్తు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్‌ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుని జగన్‌ పనిచేస్తున్నారని రాజేందప్రసాద్‌ ఆరోపించారు. ఆంధ్రా వాళ్లపై కేసీఆర్‌ చేసిన విమర్శలు మరిచిపోయారా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. వెయ్యికోట్ల  కోసం జగన్‌ ఎంత నీచానికైనా దిగజారుతారా అంటూ ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం మోదీ, కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్‌ను అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ ఏపీలో చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వారి ఓటు ద్వారా వైకాపా అభ్యర్థులకు తగిన గుణపాఠం చెబుతారని రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు.