జగ్‌మోహన్‌ దాల్మియా కన్నుమూత

2

దిల్లీ  సెప్టంబర్‌ 20(జనంసాక్షి):

బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా కన్నుమూశారు. కోల్‌కతాలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తీవ్రమైన ఛాతినొప్పితో ఆయన గురువారం రాత్రి బీఎం బిర్లా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జగ్‌మోహన్‌ దాల్మియా… భారత క్రికెట్‌బోర్డును ఆర్థికంగా బలపేతం చేసిన వ్యక్తి… క్రికెట్‌ అంటే ఎక్కువగా ఇష్టపడే ఆయన కళశాల రోజుల్లో దాల్మియా వికెట్‌కీపింగ్‌పై మక్కువ చూపించేవారు. వికెట్‌ కీపర్‌గా కోల్‌కతాలోని పలుక్లబ్‌లకు ఆయన పలు మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఎంఎల్‌ దాల్మియా కంపెనీని దేశీయంగా అగ్రశ్రేణి నిర్మాణరంగ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. అనంతరం బీసీసీఐలో పలు బాధ్యతలు నిర్వహించారు. బీసీసీఐ ా’య్రర్మన్‌గా రెండు దఫాలు వ్యవహరించారు. రెండో దఫా బాధ్యతలు నిర్వహిస్తుండగా కన్నుమూశారు. 1997లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి ా’య్రర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.క్యాబ్‌ కోశాధికారి నుంచి ఐసీసీ అధ్యక్షుడి వరకు.. దాల్మియా ఈ ఏడాది మార్చిలో తన రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బీసీసీఐ పగ్గాలు అందుకున్నారు. దాల్మియా మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం అనూహ్యమే. బీసీసీఐని అత్యంత సంపన్న బోర్డుగా మార్చిన ఘనతను సొంతం చేసుకోవడం దగ్గర నుంచి బహిష్కరణ గురికావడం వరకు.. 74 ఏళ్ల జగ్మోహన్‌ దాల్మియా క్రీడా పాలకుడిగా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు.1978లో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) కోశాధికారిగా కెరీర్‌ ఆరంభించిన దాల్మియా.. 1983 బీసీసీఐ కోశాధికారిగా ఎన్నికయ్యాడు. తర్వాత బోర్డు కార్యదర్శిగా పని చేశాడు.1997లో ఐసీసీ అధ్యక్షుడిగా ఎదిగాడు. ఆ సమయంలో ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ కేంద్రంగా మారింది. 1987, 1996 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు భారత ఉపఖండానికి రావడంలో దాల్మియాది కీలక పాత్ర. 1990ల ఆరంభంలో దాల్మియా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి బీసీసీఐ రూ.81.60 లక్షల లోటులో ఉంది. ఏడాదిలోనే రూ.100 కోట్లకుపైగా టర్నోవర్‌ సాధించి ప్రపంచంలోనే సంపన్న బోర్డుగా అవతరించింది. దాల్మియా 2001 నుంచి 2004 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2005 ఎన్నికల్లో శరద్‌ పవార్‌ శిబిరం చేతిలో అతడి వర్గం ఓడిపోయింది.ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో తర్వాతి సంవత్సరమే అతణ్ని బోర్డు నుంచి బహిష్కరించారు.దాల్మియా నెమ్మదిగా తన ప్రతిష్టను పునర్‌నిర్మించుకున్నాడు. పదేళ్ల తర్వాత తిరిగి బీసీసీఐ పగ్గాలు అందుకున్నాడు. మధ్యలో 19 నెలలు మినహా దాల్మియా 1993 నుంచి క్యాబ్‌కు అధ్యక్షుడు దాల్మియానే.