జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి. సునీత మహేందర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను

సునీతమ్మ సేన జిల్లా కన్వీనర్ అశోక్ ముదిరాజ్
మోమిన్ పేట జూలై 14 (జనం సాక్షి)
బుధవారం మర్పల్లి లో అధికారిక పర్యటన లో భాగంలో వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి. సునితా మహేందర్ రెడ్డి  పై సొంత టిఆర్ఎస్ పార్టీ నాయకుల దాడిని పిరికిపంద చర్య అని సునీతమ్మ యువసేన జిల్లా కన్వీనర్ అశోక్ ముదిరాజ్ పేర్కొన్నారు గురువారం ఆయన మాట్లాడుతూ సునీత మహేందర్ రెడ్డి ఒక మహిళ అని చూడకుండా ప్రజా ప్రతినిధి పై  ఇలాంటి సంఘటనలు ఇకముందు జరగకూడదని భావిస్తున్నాను.. ఇంతకుముందు  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాజెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి  అదేవిధంగా  ప్రోటోకాల్ విషయంలోనూ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు.. తెలంగాణ రాష్ట్రంలోనే మూడోసారి  హ్యాట్రిక్ జడ్పీ చైర్మన్ గా రికార్డు సృష్టించిన మహిళా ప్రజా ప్రతినిధి పై టిఆర్ఎస్ పార్టీకి చెందిన పార్టీ నాయకులకి దాడి చేయించడం భావ్యం కాదన్నారు మెతుకు  ఆనంద్ కెసిఆర్  వెంట ప్రగతి భవన్ లో ప్రెస్మీట్లో. హెలికాప్టర్లలో తిరగడం మానుకొని తెచ్చిన జీవోలను ఇంప్లిమెంటేషన్ చేసి నిధులు వచ్చేలా చూడాలి ఆయన సూచించారు తీవ్ర వర్షాలతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు టిఆర్ఎస్ నాయకులు  అభివృద్ధిపై ద్రుష్టి సారించాలి.అభివృద్ధి చేత  కాక. నిధులు తీసుకువచ్చే సత్తా లేని నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ అదృష్టాన్ని వర్గం ఇలాంటి నాయకుల పై చర్యలు తీసుకోవాలి. ఆయన కోరారు