జనం అల్లాడుతుంటే ఐపీఎల్ నిర్వహిస్తారా?

zcr8llroమహారాష్ట్రలో ఐపీఎల్ నిర్వహణపై ముంబై హైకోర్టు మండిపడింది. మహారాష్ట్ర క్రికెట్ బోర్డుకు అక్షింతలు వేసింది. ప్రజలు కరువుతో అల్లాడుతుంటే… ఐపీఎల్ నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించింది. ఒక పక్క నీటి కోసం ముంబై వాసులు అల్లాడుతుంటే… వేల లీటర్ల నీటితో పిచ్ లు తయారు చేస్తున్నారని మండిపడింది. కరువు లేని రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహించుకోవాలని ముంబై హైకోర్టు సూచించింది. అయితే, తాము పిచ్ ల తయారీ కోసం తాగునీటిని వాడుకోవడం లేదని బోర్టు సభ్యులు వాదించారు. కానీ, కోర్టు మాత్రం బోర్డు వాదనలతో విభేదించింది. మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుండటంతో… బాంబే హైకోర్టు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.