జనని సురక్ష యోజన పథకం కింద రూ. 1000 గర్భిణీలకు అందించాలి : కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 8 : మార్పు పథకం కింద నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసిడిఎస్. ఐకెపి, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన శిబిరం గురువారం నాడు నిర్వహించారు. అంగన్‌వాడి, ఆశ, ఎఎన్‌ఎం, మహిళ సమాఖ్య ప్రతినిధులకు సూచనలు అందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్రిస్టినా జడ్. చొంగ్థు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సర్వే ద్వారా గర్బిణీలగుర్తించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరగాలని, వారికి సకాలంలో జనని సురక్ష యోజన పథకం కింద 1000 రూపాయలు అందించాలని లేకపోతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పేషెంట్‌కు ఉచితంగా ఆహారం అందించాలని, 108 సర్వీసు ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, మతా శిశు మరణాల రేటును తగ్గించాలన్నారు. డెలివరీ అయిన తరువాత పౌష్టికాహారం అందించాలని, ముర్రుపాల యొక్క ఆవశ్యకత తెలపాలన్నారు. క్రమపద్ధతిలో టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హరినాథ్, ఐకెపి/పిడి వెంకటేశం, ఆర్‌డిఓ హన్మత్‌రెడ్డి, ఐసిడి ఎస్/పిడి మీరా బెనార్జీ తదితరులు పాల్గొన్నారు.