జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):వచ్చే జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రకటించారు. ఈ ఫాస్టాగ్‌ వల్ల ప్రయాణికులు టోల్‌ ప్లాజాల దగ్గర డబ్బు చెల్లించడానికి ఆగాల్సిన అవసరం ఉండదని, దీంతో సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని టోల్‌ ప్లాజాలలో ఫాస్టాగ్‌ కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఫాస్టాగ్‌ లేని వాళ్ల కోసం ఒక క్యాష్‌ కౌంటర్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. క్రమంగా ఈ కౌంటర్లను కూడా తొలగిస్తామని గతంలోనూ ప్రభుత్వం ప్రకటించింది.