జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా సచ్చు స్రవంత్ కన్నా నియామకం.
రఘునాథ పాలెం జులై 17(జనం సాక్షి) జనసేన పార్టీ మండలం నూతన కమిటీలను జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం నియమించారు .16 మందితో నియమిపబడ్డ ఈ కమిటీలో సచ్చు స్రవంత్ కన్నా , జక్కుల శ్రీకాంత్ లను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గా మరియు భూక్యా మురళి మొగలిపాలెపు కృష్ణమోహన్ లును ఉపాధ్యక్షులుగా నియమించారు . పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని కోరుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు