జనసేన మద్దతుకోరిన విహెచ్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌4  (జనంసాక్షి):   జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ భేటీ అయ్యారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని పవన్‌ను వీహెచ్‌ కోరారు. హుజూర్‌నగర్‌ ఉపెన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీచేస్తున్నారు. యురేనీయం ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఇటీవల పవన్‌ను వీహెచ్‌ కలిసిన సంగతి తెలిసిందే. వీహెచ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి పవన్‌కల్యాణ్‌ హాజరై మద్దతు తెలిపారు.