జనాదరణలో సీఎం కేసీఆర్‌కు తొలిస్థానం

kcr-610x345 హైదరాబాద్: దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఎంపికైనట్లు ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ప్రజాదరణపై చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం ఈ సంస్థ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రజాదరణ విషయంలో నిర్వహించిన సర్వేలో 87 శాతం రేటింగ్‌తో సీఎం కేసీఆర్ మళ్లీ ఆగ్రస్థానంలో నిలిచారని పేర్కొంది.

తర్వాత 85 శాతం రేటింగ్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండో స్థానంలో, 79 శాతం రేటింగ్‌తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారని తెలిపింది. గతకొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత 75 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సంయుక్తంగా 58 శాతం రేటింగ్‌తో ఏడోస్థానంలో నిలిచారు. వీడీపీ అసోసియేట్స్ ప్రకటించిన ముఖ్యమంత్రుల రేటింగ్స్ వివరాలివీ..