జపాన్‌లో భారీ భూకంపం
న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి): జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. జపాన్‌లోని బొనిన్ దీవులలో శనివారంనాడు భారీ భూకంపం సంభవించింది. జపాన్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం ప్రభావంతో కొన్ని భవనాలు ఊగిపోయినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారు బొనిన్ ఐల్యాండ్స్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.8 గా నమోదైంది. భూకంప తీవ్రతను అమెరికా జియోలాజికల్ సర్వే 7.8గా ప్రకటించగా, ఐఎండీ 7.9 తీవ్రతగా ప్రకటించింది. జపాన్ విూడియా భూకంప తీవ్రతను 8.5గా పేర్కొంటోంది. ప్రస్తుతానికి సునావిూ హెచ్చరికలేవీ జారీ కాలేదు. బొనిన్ ఐల్యాండ్స్‌కు 660 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. భారీ తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్ రాజధాని టోక్యోలో నిమిషం పాటు భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. . ఈ భూకంపంవల్ల ప్రాణనష్టం సంభవించకపోయినా, ఆస్తినష్టం ఉన్నట్టు సమాచారం అందుతున్నది. రిక్టర్ స్కేలుపై శనివారంనాటి భూకంపం తీవ్రత 8.5గా నమోదైనట్టు ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. జపాన్ తీరప్రాంతంలో అధికారులు సునావిూ హెచ్చరికలు చేయనప్పటికీ,
ఎపుడు ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో, ఈక్వేడర్‌లోని క్విటో పట్టణంలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది.అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 4.8గా నమోదైంది.
దిల్లీలో స్వల్ప భూప్రకంపనలు దేశ రాజధాని దిల్లీలో సైతం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు ఐఎండీ ప్రకటించింది.