జపాన్‌లో స్వావిూజీని ఉరితీశారు
– కార్లలో విషవాయువు వదిలిన కేసులో నిందితుడిగా స్వావిూజీ
– ఉరిని నిర్దారించిన జపనీస్ విూడియా
టోకియా, జులై6(జనం సాక్షి) : జపాన్‌లో ఆమ్ షిన్రికియో కల్ట్ నేత షోకో అసాహారా, ఆయన ఆరుగురు అనుచరులను శుక్రవారం ఉరితీశారు. ఈ విషయాన్ని జపనీస్ విూడియా నివేదికలు వెల్లడించాయి. మరో 12 మంది ఆమ్ సిన్రికియో కల్ట్ సభ్యులకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. వీరందరికీ జనవరిలో ఉరిశిక్షలు ఖరారు చేశారు. 1995లో టోక్యోలోని సబ్‌వేలో కార్లలో విషవాయువు వదిలిన కేసులో వీరిని ఉరితీశారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందగా, 6వేల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. జపనీస్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కల్ట్ నేత అసాహారా ఉరిని నిర్ధారించారు. 1995 సబ్‌వే దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం
సృష్టించింది. ప్లాస్టిక్ సంచులలో విషవాయువు నింపి… రైలు, కార్లలో విడుదల చేయడంతో 13మంది మృతిచెందగా… వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. 1984లో స్థాపించబడిన ఆమ్ షిన్రికియో కల్ట్… అగశ్రేణి విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లను కూడా పొందింది. జపాన్‌తో పాటు రష్యాలోనూ ఈ ఆమ్ షిన్రికియో కల్ట్‌ను ఆచరించేవారున్నారు. అయితే ఈ కల్ట్ మూడు గ్రూపులుగా విడిపోయింది. అనంతరం ప్రభుత్వం నిషేధించింది. అసాహారాను ఉరి తీయడంతో ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వారి ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.