*జమిలి ప్రజా సాంస్కృతిక వేదిక కార్యక్రమాలను జయప్రదం చేయండి: రాష్ట్ర కన్వీనర్ ఎల్.వెంకన్న*

బయ్యారం,జూన్ 1(జనంసాక్షి):
బుధవారం బయ్యారం బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద జమిలి ప్రజా సాంస్కృతిక వేదిక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని జమిలి ప్రజా సాంస్కృతిక వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎల్ వెంకన్న చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేని ఒక్క భారతదేశానికే పరిమితమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఏర్పడిన సామాజిక వ్యవస్థ మనదని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితకాలమంతా శోధించి తన ఎన్హాలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథంలో దేశంలో పాతుకుపోయిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ధ్వంసం చేయడం ఒక్కటే ఏకైక మార్గమని బోధించాడని, కానీ విద్యావంతులైన తమ జాతి వారు అగ్రవర్ణాలకు,వారి పార్టీలకు, సంస్థలకు, చెంచాలుగా మారిన వైనం చూసి కన్నీటిపర్యంతమయ్యారని గుర్తుచేశారు. అంబేద్కర్ అడుగుజాడలో కుల నిర్మూలన ధ్యేయంగా,సామాజిక బాధ్యత లక్ష్యంగా జమిలి ఆవిర్భావం అనంతరం సామాజిక బాధ్యతగా ఏడు రోజుల ప్రణాళిక కార్యాచరణకు సిద్ధమైందని, ఇందులో భాగంగా కార్యాచరణకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.జమిలి జూన్ నెల ప్రోగ్రామ్స్ లో భాగంగా నేను మనిషినే అనే పుస్తకావిష్కరణ సభ ఈ నెల 5న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సిపిఎం ఆఫీస్ మహబూబాబాద్ లో, జూన్ 6న  జమిలి ప్రజా సాంస్కృతిక, అంబేద్కర్ జ్ఞాన యాత్ర బయ్యారం,గార్ల మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో జరుగుతుందని, జూన్ 12న బయ్యారంలో జమిలి అవగాహన సదస్సు జరగబోతుందని, ఈ  కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండవరాజు మల్లేష్,ఏనుగుల ఐలయ్య తెరాస నాయకులు,కొమిరె వెంకన్న తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, చల్లా గోవర్ధన్ బీసీ జనసభ సంఘం జిల్లా అధ్యక్షులు,తుడుం రాజేష్, కొమిరె జనార్ధన్,కొదుమూరి విజయ్ బీసీ జనసభ మండల అధ్యక్షులు, శెట్టి థామస్ బీసీ జనసభ యూత్ అధ్యక్షులు, శెట్టి శ్రీకాంత్ బీసీ జనసభ కో కన్వీనర్, భూక్యా నరేందర్ పాల్గొన్నారు.

 

తాజావార్తలు