జమ్మికుంటలో నిర్బంధ తనిఖీలు
కరీంనగర్: జమ్మికుంటలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో చేపట్టిన నిర్బంధ తనిఖీల్లో 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 25 బైక్‌లు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెయ్యి లీటర్ల బెల్లంపానకం, 25 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు.