జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్తత

జమ్మూ కశ్మీర్‌లో బీఫ్‌ అమ్మకాలపై నిషేధాన్ని తక్షణమే తొలగించాలని నిరసనకారులు చేపట్టిన అందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గో మాంసం నిషేధాన్ని సరిగా అమలు చేయాలని హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దాన్ని వేర్పాటు వాద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సందర్భంగా చేపట్టిన ఆందోళనలో నిరసనకారులు పాకిస్తాన్‌ జెండాలు ఎగురవేశారు. వారిని నియంత్రించడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో ఆందోళన కారులను చెల్లాచెదురు చేయడానికి లాఠీ చార్జ్‌ జరిపి, బాష్పవాయును ప్రయోగించారు.