జయలలిత ఘన విజయం

1

– ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు

చెన్నై,జూన్‌30(జనంసాక్షి): తమిళనాట జయలలిత రికార్డు విజయం సాధించారు. చెన్నైలోని ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఘనవిజయం సాధించారు. సవిూప ప్రత్యర్థిపై లక్షా 51 వేల 252 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఆమె ప్రత్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు. 27 రిగిన ఉప ఎన్నికకు సంబంధించి  ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటిని నుంచీ ప్రతి రౌండ్‌లో ప్రత్యర్థులకు అందనంత స్పష్టమైన మెజార్టీతో ఆమె ఆధిక్యంలో దూసుకుపోయారు. జయలలిత ఘనవిజయంతో తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాజధాని చెన్నైలో పార్టీ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే శ్రేణులు, జయలలిత అభిమానులు ఆనందంలో మునిగి తేలారు. బాణాసంచా కాలుస్తూ, నృత్యాలుచేస్తూ, మిఠాయిలు పంచుతూ సందడి చేస్తున్నారు. ఆమె నివాసం పోయస్‌ గార్డెన్‌కు చేరుకున్న అభిమానులు అక్కడ బాణాసంచాకాల్చి నృత్యాలు చేశారు. జయకు అనుకూలంగా నినాదాలుచేశారు. జయలలిత విజయం దాదాపుగా ఖాయం కావడంతో ముందే చేరుకున్న అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వీధుల్లోకి చేరి బాణసంచా కాల్చారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ఉప ఎన్నిక ఫలితాలే చెప్పేస్తున్నాయంటూ మిఠాయిలు పంచుకున్నారు. పెద్దఎత్తున అభిమానులు జయలలిత ఇంటివద్దకు చేరుకున్నారు. ఆమెకు అనుకూలంగా నినాదాలు చూస్తూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్న మరో పార్టీ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా సైతం జయ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యుత్‌ కొరతను అధిగమించడం తదితరాల వల్లే ఆమెకు ఇంతటి భారీ విజయం సాధ్యమయ్యిందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు సృష్టించారు. ఎన్నికలలో అత్యధిక ఓట్ల ఆధిక్యతతో ఆమె విజయం సాధించారు. జయలలిత లక్షా ఏభైవేల పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇది దేశంలోనే ఒక రికార్డుగా కనపడుతుంది.ఇంతకుముందు ఎపిలోని తిరుపతిలో టిడిపి అభ్యర్ధి సుమారు లక్షా పాతికవేల ఆధిక్యతతో గెలుపొందారు.ఇప్పుడు చెన్నైలోని ఆర్‌.కె.నగర్‌ నియోజకవర్గం నుంచి జయలలిత ఆ రికార్డును అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.ఈ ఉప ఎన్నిక పలితం భవిష్యత్తులో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంకేతం అని అన్నా డి.ఎమ్‌.కె. పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి. కాగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అయిన డి.ఎమ్‌.కె. పోటీలో లేదు. ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆ రాష్ట్ర గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శుభాకాంక్షలు తెలిపారు. లెక్కింపు కేంద్రం సహా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.