జయలలిత స్థానంలో ఇక శశికళ

శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో పోయె్‌సగార్డెనలో హైడ్రామా చోటుచేసుకుంది. అన్నాడీఎంకే నేతలంతాjjs1220 చిన్నమ్మ ముందు వరుసగా నిలబడి ఇక తమను పాలించమని విన్నవించుకున్నారు. దీంతో వారి మాటలను శశికళ మననంలోకి తీసుకున్నారు. మరోవైపు… ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం శనివారం రాత్రి ఆమెతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘శశికళతోనే పార్టీకి భవిష్యత్తు. 33 ఏళ్లుగా జయలలిత వెన్నంట ఉండి… పార్టీకోసం అహరం కృషి చేశారు. సైనిక క్రమశిక్షణతో కూడిన ఆమె తీరు పార్టీ నేతలను ముందుండి నడిపిస్తుంది. ఆమెకు అండగా ఉందాం. పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకునే వారి కుట్రలను తిప్పికొడదాం’’ అని అన్నా డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు… రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల శశికళ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. మరోపక్క, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్‌ నేతలైన ఎం.తంబిదురై, కేఏ సెంగోట్టయ్యనలు కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. అయితే, శనివారం వీరు మనసు మార్చేసుకోవడం గమనార్హం. పార్టీ ప్రిసీడియం చైర్మన ఇ.మధుసూదన, సీనియర్‌ నేతలైన కేఏ సెంగోట్టయ్యన, బి.వలర్మతి, గోకుల ఇందిర, సైదై దురైస్వామి తదితరులంతా పోయెస్‌గార్డెనకు వెళ్లారు. వేదనిలయం నుంచి బయటకు వచ్చిన శశికళ ముందు.. వరుసగా నిలబడిన నేతలు చేతులు జోడిస్తూ ఆమెను బతిమలాడారు. వారి మాటల్ని ఆసాంతం ఆలకించిన ఆమె తల ఊపుతూ లోపలికి వెళ్లారు. త్వరలో జరగనున్న అన్నాడీఎంకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశాల్లో శశికళ పేరు ప్రకటించడం ఖాయమైపోయింది. మరోవైపు, తన బంధువులెవరూ అధికార వర్గంలో, పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని శశికళ ఒక ప్రకటనలో గట్టిగా హెచ్చరించారు.