జర్నలిజం కత్తిమీద సాములాంటిది జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలి..

కామారెడ్డి  సెప్టెంబర్1(జనంసాక్షి);
జర్నలిజం కత్తిమీద సాములాంటిదని జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని అబ్రబాయిన స్వామి అన్నారు.కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా కమిటీ  సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. గౌరవ అధ్యక్షులు ముదాం శంకర్ పటేల్,అధ్యక్షుడిగా ముదాం శివ శంకర్ పటేల్ , ఉపాధ్యక్షులుగా గరిగే సురేష్, ప్రధాన కార్యదర్శి భూపాల్ రాహుల్, సహాయ కార్యదర్శి సబ్బని ప్రవీణ్ కుమార్, కోశాధికారి అంబటి అనిల్ కుమార్ , ముఖ్య సలహాదారులు బండారి శంకర్, బొమ్మర బాలయ్య, కార్యవర్గ సభ్యుడు గోత్రాల విక్రం లను బుధవారం  దోమకొండ మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయంలో శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అబ్రబాయిన స్వామి మాట్లాడుతూ జర్నలిజం వృత్తి  కత్తిమీద సాములాంటిదని జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలన్నారు. సమాజాన్ని చైతన్యవంతులను చేసేందుకు జర్నలిస్టులు ప్రత్యేక పాత్ర వహిస్తున్నారని తెలిపారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తెచ్చి ప్రజా సమస్యలకు పరిష్కార దిశగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి,సీతారాం ప్రసాద్,రసూల్ బాయ్,రమేష్,రమాకాంత్ రెడ్డి, ఎస్కే మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.