జర్నలిస్టుపై దాడి చేసిన బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలి

టిఎంజెయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవ్

కురవి, అక్టోబర్ 11 ( జనం సాక్షి న్యూస్ ) :

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు సురేష్ పై అమానుషంగా దాడి చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల జర్నలిస్టుల యూనియన్ (టిఎంజెయూ) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దాడిని ఖండించారు. పోడు భూముల సర్వేలో ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ రమేష్ వివిధ అక్రమాలకు పాల్పడడమే కాకుండా ప్రశ్నించిన జర్నలిస్టు సురేష్ పై అమానుషంగా దాడి చేయడం సరి కాదన్నారు. తక్షణమే భేషరతుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జర్నలిస్ట్ సురేష్ కు క్షమాపణ చెప్పాలని అన్నారు. అలాగే జర్నలిస్ట్ పై దాడి చేసినందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు బీట్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.