జర్నలిస్టులకు మరోసారి ఉచితంగా మెడికవర్ వైద్య పరీక్షలు

 

28 వరకు అవకాశం కల్పించిన ఆసుపత్రి యాజమాన్యం

కూపన్లు కోసం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సంప్రదించండి

ఫీజు రాయితీ కోసం ప్రయత్నాలు

విశాఖపట్నం ఫిబ్రవరి 16(జనం సాక్షి బ్యూరో ):
వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సభ్యులు కోసం మెడికవర్ (ఇసుకతోట) ఆస్పత్రి యాజమాన్యం మరోసారి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్. దుర్గారావు లు తెలిపారు.. ఈ మేరకు బుధవారం వీరు డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో మెడీకవర్ ఆసుపత్రి యాజమాన్యం ఈ అవకాశం కల్పించిందన్నారు.. అయితే కొంతమంది జర్నలిస్టులు అప్పట్లో వేర్వేరు కారణాల వల్ల వినియోగించుకొలేక పోవడం జరిగిందన్నారు.. విధుల్లో ఖాళీ లేక అప్పుడు వారు సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు… ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి యాజమాన్యాన్ని మరోసారి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరడం జరిగిందన్నారు.. దీనితో వారు ఈ నెల 28 వరకు మాత్రమే
వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తానని చెప్పారన్నారు..గుండె జబ్బులకు సంబంధించిన పరీక్షలు కూడా చేయనున్నట్లు వారు వివరించారన్నారు… సుమారు 12 వేల విలువచేసే వైద్య పరీక్షలను మెడికవర్ ఆసుపత్రి జర్నలిస్టుల కోసం ఉచితంగా చేస్తుందని, కావున ఈ అవకాశాన్ని అవసరం ఉన్న వారు వినియోగించు కావాలని కోరారు.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సభ్యత్వం లేని జర్నలిస్ట్ లు కూడా వారి సంస్థ గుర్తింపు కార్డ్ చూపించి డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయం పని వేళల్లో మెడికవర్ కూపన్ పొందవచ్చునని తెలియజేశారు. కేవలం జర్నలిస్ట్ లుకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు ..రెండో దశలో కుటుంబ సభ్యులు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు…. తాము కోరిన వెంటనే మరోసారి ఉచిత వైద్య పరీక్షలు అవకాశం కల్పించిన యాజమాన్యానికి ఫోరమ్ ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్, నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి మూర్తి ,కార్యవర్గ సభ్యులు ఇరోతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు