జర్నలిస్టులకు హెల్త్ కార్డులు
– దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం
– అల్లం హర్షం
హైదరాబాద్,జులై21(జనంసాక్షి):
రాష్ట్రంలోని వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యకార్డుల దస్త్రంపై సీఎం సంతకం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు త్వరగా అందేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రెస్ అకాడవిూ ఛైర్మన్ అల్లం నారాయణలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల ఫైల్‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంపై జర్నలిస్టులందరూ హర్షం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డుల జారీకి త్వరలోనే చర్యలు తీసుకోనున్నారు. విశ్రాంత, వర్కింగ్ జర్నలిస్టులకు త్వరగా హెల్త్ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే