జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

4

– హెల్త్‌ కార్డుల ప్రక్రియకు ప్రారంబఙంఇచన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి): జర్నలిస్టుల హెల్త్‌ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో హెల్త్‌కార్డుల వెబ్‌సైట్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి  కెటిఆర్‌ ప్రారంభించి కొందరికి కార్డులను అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆలస్యమైనా హావిూని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  జర్నలిస్టులు సమస్యను అర్థం చేసుకోవాలని, కొత్త సంసారం కనుక కొంత ఆలస్యం ఆయిన మాటవాస్తవమని, అయినా వారి  సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పాత్రికేయుల ఆరోగ్యకార్డుల వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ కొందరు పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాత్రికేయులందరికీ ఆరోగ్య కార్డులు అందజేస్తామన్నారు. జర్నలిస్టులకు ఏసీ బస్సుల్లోనూ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. విలేకరులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. పాత్రికేయులు, న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యమంలో తమతోపాటు కలసి నడిచిన వారి సమస్యలు తమకు తెలుసని అన్నారు. అయితే ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు వెంటనేఉ అములకాకపోవడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించాలన్నారు. ప్రతి సమస్యకు రోడ్డెక్కకకుండా కొంత సంయమనంతో ఉండాలన్నారు. ఇళ్లస్థలాల హావిూని కూడా నెరవేరుస్తామని అన్నారు. సిఎం కెసిఆర్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు.   ఇతరరాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఇచ్చే సౌకర్యాలను అధ్యయనం చేసి రావాలని ప్రెస్‌  అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణకు మంత్రి సూచించారు. అక్కడ ఉన్న మంచి సౌకర్యాలను కూడా అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. జర్నలిస్టులకు ఎసి బస్సుల్లో కూడా అనుమతి ఇస్తున్నామని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. వారి సంక్షేమానికి ఆర్టీసీ ముందుంటుందని అన్నారు. అంతకుముందు ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి హెల్త్‌ స్కీం లేదని అన్నారు. ఆలస్యం అయినా ప్రభుత్వం హావిూని నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే లెక్కకు మిక్కిలి జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు రావడంతో కొంత స్క్రూటిని జరుగుతోందన్నారు. సమాచార కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి,ఎంపి బాల్క సుమన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.