జర్నలిస్టుల హెల్త్‌ కార్డుల జీవో జారీ

1

– కృతజ్ఞతలు తెలిపిన ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

హైదరాబాద్‌,జులై22(జనంసాక్షి):

తెలంగాణ జర్నలిస్టులకు సంబంధించి హెల్త్‌ కార్డుల జీవోను ప్రభుత్వం జారీచేసింది. విశ్రాంత, వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం జీవో 64ను విడుదల చేసింది. దీనిపై జర్నలిస్ట్‌ సంఘాలు హర్షం ప్రకటించాయి. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నయా పైసా ఖర్చు లేకుండా జర్నలిస్టులకు వైద్యం అందించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు.  తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుతో పాటు తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలకు కూడా హెల్త్‌కార్డు వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రతీ జర్నలిస్టు కుటుంబానికి వైద్య పరంగా ఎంతైనా ఖర్చు చేస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొందని తెలిపారు. ఇంత డబ్బు మాత్రమే వెచ్చిస్తామని ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. అయితే దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎక్కడా తీసుకోలేదని తెలిపారు. ఒక్క తెలంగాణ ప్రభుత్వమే సా¬సపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా అల్లం నారాయణతో పాటు పలువురు జర్నలిస్టులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.