*జర్నలిస్ట్ గర్జన ను విజయ వంతం చేయండి*

 
నాచారం(జనం సాక్షి): మేడ్చల్   జిల్లా నుండి మే 28 న జరిగే జర్నలిస్టుల గర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని టియూడబ్ల్యూజె ఐజేయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షడు ఎం.వెంకట్ రెడ్డి,  కార్యదర్శి  జి. బాలరాజులు పిలుపు నిచ్చారు.  జర్నలిస్ట్ గర్జన పోస్టర్ ను కీసరలొని జిల్లా కాలెక్టరేట్ లో విడుదల చేశారు.   ..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల కు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదన్నారు…వాటి పరిష్కారం కోరుతూ చేపట్టిన ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలన్నారు. మన కోసం మనము చేస్తున్న ఉద్యమం లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.     ఈ కార్యక్రమంలో
జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రవి,  ఐజేయూ సభ్యులు రంగు వెంకటేష్ గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి కృష్ణ, ఉపాధ్యక్షులు కె.శ్రీనివాస్, అంజిరెడ్డి,  సహాయ కార్యదర్శి రవీందర్,  జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్, బాలాజీ,    వివిధ   ప్రెస్ క్లబ్ అధ్యక్షు, కార్యదర్శులు బాలరెడ్డి, నాగరాజు, గోవింద్, వెంకటరెడ్డి,  కాసి, సీనియర్ నాయకులు స్టాప్ రిపోర్టర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, రామకృష్ణ,   ఆదినారాయణ, సంభ శివుడు, ఆవుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.