జలకళను సంతరించుకున్న మిడ్ మానేర్
-నెరవేరుతున్న లక్ష్యం
కరీంనగర్,నవంబర్6 (జనంసాక్షి): మెట్ట ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లానేకాక ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 2 లక్షలకుపైగా ఎకరాలకు సాగు నీరందించేలక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్‌పల్లి మండలం మాన్వాడ వద్ద మానేర్ వాగుపై నిర్మిస్తున్న మిడ్ మానేర్ తుది దశకు చేరుకుంది. ఈప్రాజెక్టు తెలంగాణాలోనే శరవేగంగా పనులు పూర్తిచేసుకుంటుండగా డిసెంబర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాలకు త్రాగునీరందించే ఉద్దేశ్యంతో ఇటీవలే ఎస్సారెస్పీనుంచి 5 టీఎంసీల నీటితోనింపడంతో జలకల సంతరించుకుంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మిడ్ మానేర్ రూపమే మారిపోతుండగా తెలంగాణా రాష్టాన్రికి గుండె కాయలా మారుతోంది బోయిన్ పల్లి మండలం మాన్వాడ వద్ద మానేర్‌వాగుపై 25.873 టీఎంసీల నీటి సామర్థ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు 2006లో పునాదిరాయి పడింది. 339.39 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈప్రాజెక్టు ఆదినుంచి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ వచ్చింది. మూడెల్ల కాలంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో పనులు ఆర్దాంతరం గా నిలిచిపోయాయి. మల్లీ 2010లో టెండర్ పిలువగా సాంకేతిక కారణాలతో ప్రక్రియ పూర్తి కాలే దు. అనంతరం మల్లీ రెండేల్లకు 454 కోట్ల అంచనాతో టెండర్ జారీ చేయగా ఐవీఆర్‌సీఎల్ సంస్థ 20శాతం లెస్‌తో పనులు దక్కించుకుని నిర్మాణం చేపట్టింది, సంస్థ పనుల్లో నాణ్యత పాటించక పోవడంవల్ల గతఏడాదిలో కురిసిన భారీ వర్షాలకు మిడ్ మానేర్ ఎడమ కట్ట పూర్తిగా తెగిపోయిం ది. దీంతో తెలంగాణా ప్రభుత్వం సదరు కాంట్రాక్టర్‌ను రద్దు చేస్తూ మల్లీ కొత్తగా టెండర్ పిలిచిం ది. 316 కోట్లతో ఎస్‌ఆర్‌ఆర్‌సి బెకమ్, ఎస్‌ఎంఎల్‌ఎస్ సంస్థలు సంయుక్తంగా పనులు దక్కించు కున్నాయి. 2017 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో పది టీఎంసీల నీరు నిల్వ ఉంచాలని భావించినప్పటికి ఆశిం చిన స్థాయిలో వర్షాలు కురువక పోవడంతో శ్రీరాంసాగర్‌నుంచి తాగు నీటి అవసరాలకోసం 5 టీఎంసీల నీటిని రెండు దఫాలుగా విడుదల
చేయడంతో జల కల సంతరించుకుంది. ప్రస్తుతం 25 గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది చివర వరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయా లని సీఎంకేసీఆర్, భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావులు ఆదేశించడంతో పనులువేగంగా సాగుతున్నాయి,. ఈప్రాజెక్టు పూర్తయితే మొత్తం 5 జిల్లాలు (కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగ ల్ అర్బన్, సిద్దిపేట, జనగామ) పరిదిలోని 19 మండలాల్లో 2 లక్షల 146 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథలో సిరిసిల్ల, చొప్ప దండి, వేములవాడ నియోజకవర్గాల్లోని 18 మండలాల్లోని 466 గ్రామాలకు సాగు నీరందనుంది. ఇదిలా ఉండగా మిడ్ మానేర్‌లో ముంపుకు గురవుతున్న 12గ్రామాలలో ఇంకా పరిహారంచెల్లించే కార్యక్రమ పూర్తి కాలేదు. ఈప్రాజెక్టులో బోయిన్‌పల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరద వెల్లి, శాభాష్‌పల్లి, మాన్వాడ, వేములవాడమండంల రుద్రవరం, అనుపురం, కోడుముంజ, ఆరె పల్లి, సంకెపల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా గ్రామాలు ముంపుకు గురవుతు న్నాయి. 2008 గెజిట్ ప్రకారం 11వేల 731 మంది నిర్వాసితులుగా మారుతున్నారని అధికారులు వెల్లడించారు. నిర్వాసితులకోసం పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టింది. నిర్వాసితులకు చెల్లిం చే ప్యాకేజీలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంతో నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం పథకాన్ని కూడా లింక్ చేస్తుండడంతో ఎల్లకాలం జల కళతో ఉట్టిపడనుందని అధికారులు చెపుతున్నారు.