జలమయమైన మోడల్ స్కూల్ కళాశాల, హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులుఆందోళన ,జాడ లేని అధికారులు.

 

జనం సాక్షి. సైదాపూర్. మండలంలోని సోమారం గ్రామంలో నిర్మించిన మోడల్ స్కూల్ ను వరదలు చుట్టుముట్టాయి గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఎగువ నుండి వరద పోటెత్తడంతో వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది గ్రామ శివారులో సైదాపూర్ నుండి కరీంనగర్ రోడ్డు పక్కన నిర్మించిన మోడల్ స్కూల్ పూర్తిగా నీరు చుట్టుముట్టడంతో స్కూల్ హాస్టల్ గోడపై మూడు ఫీట్ల నీరు వాగు. ప్రవహించడంతో ఏ క్షణమైనా హాస్టల్లోకి నీరు చేరుతుందని భయంతో.నీటి ప్రవాహం పెరుగుతుండడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థినిలు భయాందోళన గురయ్యారు ఈ విషయం తల్లిదండ్రులకు సంబంధిత అధికారులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన చేరుకొని విద్యార్థినిలను సురక్షితంగా హాస్టల్ నుండి కాళీ చేపించి వారి స్వస్థలాలకు పంపించినారని సమాచారం మోడల్ స్కూల్ నిర్మాణమే కాకుండా చుట్టు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి కారణం అని వారు ఆరోపించారు ఇంతవరకు ఎలాంటి పనులు జరగలేదని కొందరు విద్యార్థిల తల్లిదండ్రులు తెలిపారు