జలశక్తి అభియాన్ పై శిక్షణ కార్యక్రమం: కెవికె

గరిడేపల్లి, జూలై 29 (జనం సాక్షి):కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో శుక్రవారం  జలశక్తి  అభియాన్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్  బి లవకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం 5 దశలలో చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మూడవ విడత కార్యక్రమంలో భాగంగా ప్రజలు భాగస్వామ్యంతో చేపట్ట వలసిన వివిధ రకాల పనులైనటువంటి ఇంటి పై కప్పు వర్షపు నీటి సంరక్షణ కట్టుడు నీటి సంరక్షణ గుంటలు చెక్ డ్యామ్ నిర్మాణం బోరుబావులు పునరుద్ధరణ పురాతన బావులు పూడికతీత చెరువుల పూడిక తీత వరదల నుండి సాగు భూములను రక్షించుట వంటి వివిధ అంశాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేవికే శాస్త్రవేత్త సిహెచ్ నరేష్ మాట్లాడుతూ ప్రజలు నీటి సంరక్షణ వినియోగంపై అవగాహన కల్పించడం ప్రతి గ్రామానికి మండలానికి జిల్లా కి నీటి సంరక్షణ ప్రణాళికను తయారు చేసుకోవడం ఈ ప్రణాళిక ప్రకారం వివిధ రాష్ట్ర  కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలలో అనుమతించిన నీటి సంరక్షణ పనులను ప్రజలు భాగస్వామ్యంతో చేపట్టాలని తెలిపారు. నీటి సంరక్షణ పనిలో ప్రతి వ్యక్తి చురుకుగా పాల్గొనేలా స్థానిక ప్రజలను ప్రేరేపించడంలో జిల్లా మేజిస్ట్రేట్‌లు   గ్రామ సర్పంచ్‌లు  కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలియజేశారు. పడ్డ ప్రతి చుక్క నీటిని సంరక్షించుకోవటము ఇతర నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ కార్యక్రమం అమలును వేగవంతం చేయడానికి సమీకృత విధానాన్ని అవలంబించాలని వర్షపు నీటి సంరక్షణ చెరువులు గ్రామ ట్యాంకుల సంరక్షణ కోసం పని చేయడానికి అందరు ముందుకు రావాలని సూచించారు. నీటి వనరులు పెరగడం వలన వ్యవసాయ అభివృధి అంశాలలో కేవీకే చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఎన్.సుగంధి, డి.ఆదర్శ్, 32 మంది రైతులు, 43 మంది బి ఎస్ సి అగ్రికల్చర్ విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area