జలాశయాల అడ్డా జయశంకర్ భూపాలపల్లి గడ్డ

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానం ఈజిల్లా నుండే ఆరంభం

రాష్ట్రం నలుమూలలకు నీరందించే నీటి నిల్వలు

గోదావరి,ప్రాణహిత పరవళ్లను అదిమిపట్టిన జిల్లా ఇదిభూపాలపల్లి జిల్లా అనిచెప్పవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి 86 వేలకోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈజిల్లా నుండే తన ప్రస్థానాన్ని ప్రారంభించడంతో తెలుగు రాష్ట్రాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాగునీరు, త్రాగునీటి రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ జిల్లాలో లక్ష్మి, సరస్వతి బ్యారేజిలతోపాటు కన్నేపల్లి వద్ద నిర్మించిన కీలకమైన లక్ష్మీ పంప్ హౌస్ జయశంకర్ జిల్లాలోనే ఉండడం విశేషం. లక్ష్మి, సరస్వతి బ్యారేజీల ద్వారా వందలాది టీఎంసీల గోదావరి జలాలు రాష్ట్రంలోని 18 జిల్లాలకు ఉపయోగకరంగా మారాయి. సాగునీటి అవసరాలకే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల త్రాగునీటి తోపాటు పారిశ్రామిక అవసరాల కోసం గోదావరి జిల్లాలు ఎంతో ఉపయోగకరంగామారాయి. ప్రతి సంవత్సరం లక్షలాది క్యూసెక్కుల విలువైన నీరు సముద్రగర్భంలో కలిసి పోతుండడం, ఆంధ్ర పాలకులు తెలంగాణపై వివక్ష తో ఎలాంటి బ్యారేజీలు నిర్వహించకపోవడంతో ఇంతకాలం గోదావరి నీరంతా సముద్రగర్భంలో పోతుండడం ఆనవాయితీగా వస్తుంది. గోదావరితీర ప్రాంతంలోని భూములకు కూడా,చుక్క నీరు అందక బీడు భూములుగా ఉంటున్న వాస్తవాన్ని గ్రహించిన కెసిఆర్, ఉద్యమ సమయంలోనే గోదావరి జనాలను తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలని సదుద్దేశంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగి మహాత్మకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆదిశగా అడుగులువేసి అద్భుతమైన ఫలితాలను సాధించారు. ప్రతి ఏడు సముద్రగర్భంలో పోతున్న ప్రకృతి సంపదను సాక్షాత్తు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదిమిపట్టి యావత్ తెలంగాణకు సాగు నీరు త్రాగు నీరు అందించి నీటి పారుదల రంగానికి వన్నె తెచ్చి ప్రజల మన్ననలు పొందిన కెసిఆర్ తెలంగాణ రైతాంగానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజి కూడా భూపాలపల్లి జిల్లా లోనే ఉండడం జిల్లా ప్రజలకు గర్వ కారణంగా చెప్పవచ్చు