జలియన్‌వాలాబాగ్‌ ఊచకోత సిగ్గుమాలిన చర్య

1919 అమరులకు నివాళులర్పించిన కామెరాన్‌
94 ఏళ్ల తర్వాత నోరువిప్పిన బ్రిటన్‌
అమృతసర్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః
భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ ప్రాంతాన్ని సందర్శించారు. భారత స్వాతంత్య పోరాటం సందర్భంగా జలియన్‌వాలాబాగ్‌ వద్ద జరిగిన ఆనాటి వూచకోత ఘటనపై ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. నాటి వైస్రాయ్‌ డయ్యర్‌ ఈ ఊచకోతతో చరిత్రలో నిలిచిపోయారు. బ్రిటీష్‌ చరిత్రలో ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మొదటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరానే. అనంతరం కామెరాన్‌ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్‌ ఊచకోత బ్రిటిష్‌ చరిత్రలోనే అత్యంత సిగ్గుచే-టైన సంఘటన అని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన కామెరాన్‌ చివరి రోజు జలియన్‌వాలా బాగ్‌ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అది భయంకరమైన చర్య అని కామెరాన్‌ అన్నారు. జలియవన్‌వాలా బాగ్‌ స్మారక స్థలాన్ని ఆయన సందర్శించారు. భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతోనే జలియన్‌వాలా బాగ్‌పై కామెరాన్‌ విచారం వ్యక్తం చేశారని అంటు-న్నారు. స్వాతంత్య పోరాటం సందర్భంగా భారతదేశంలో బ్రిటిష్‌ పాలనలో ఈ ఊచకోత జరిగింది. సంఘటనకు క్షమాపణ చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. బ్రిటన్‌ చరిత్రలో ఈ సంఘటన ఓ మచ్చగా మిగిలిపోతుందని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన యుకె ప్రభుత్వం ఆ సంఘటనకు విచారం వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇక్కడ జరిగినదాన్ని మనం ఎన్నడూ మరిచిపోలేమని అని నోట్‌ బుక్‌లో రాసి నెవర్‌ అనే పదాన్ని రెండు సార్లు అండర్‌లైన్‌ చేశారు. ఆ సంఘటనను గుర్తు చేసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు యుకె సమ్మతిస్తుందనే విషయాన్ని ఖాయం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ తర్వాత ఆయన స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. ఆంగ్లో – ఇటాలియన్‌ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో సహకరిస్తామని కామెరాన్‌ హావిూ ఇచ్చారు. తన భారత పర్యటనలో కామెరాన్‌ ప్రధానంగా వ్యాపారం, పెట్టు-హడులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.