జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే


13
న్యూఢిల్లీ: జల్లికట్టుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే ‘జల్లికట్టు’ పోటీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడంపై న్యాయస్థానం మంగళవారం స్టే విధించింది. జల్లికట్టుపై గతంలో సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని కేంద్రం ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులో సంబరాలు చేసుకున్నారు.

అయితే జంతు పరిరక్షణ సంస్థతో పాటు పలువురు కేంద్రం తీరుపై మండిపడుతూ జల్లి కట్టును నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం…జల్లికట్టు అనుమతిపై స్టే విధిస్తూ కేంద్రానికి, తమిళనాడు సర్కార్కు నోటీసులు జారీ చేసింది..