జల దృశ్యాన్ని ఉద్యమాలకు అడ్డాగా మార్చిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ : మంత్రి ఎర్రబెల్లి
జల దృశ్యాన్ని ఉద్యమాలకు అడ్డాగా మార్చిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ : మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని గడ్డి పోచలా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గురువారం పాలకుర్తిలోని ప్రధాన కూడలిలో బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్యోద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలోనూ చురుకుగా పాల్గొన్న యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. నిఖార్సయిన తెలంగాణ వాది. 97 యేండ్ల వయస్సులో కూడా తెలంగాణ కోసం పరితపించి మలి దశ ఉద్యమాలలో పాల్గొన్నారు.తన జల దృశ్యాన్ని ఉద్యమాలకు అడ్డాగా మార్చిన త్యాగశీలి బాపూజీ అని ప్రశంసించారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి అనేక సేవలు చేశారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.