జాకోకు ఘన నివాళి
– సైనిక లాంఛనాలతో అంత్య క్రియలు
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి):నిన్న కన్నుమూసిన లెఫ్టినెంట్ జనరల్ జేఎఫ్‌ఆర్ జాకోబ్ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు దిల్లీ కంటోన్మెంట్‌లో ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌పారికర్, భాజపా సీనియర్ నేత ఎల్‌కె. అడ్వాణి, వైమానిక దళాధిపతి అనూప్ రహా, సైనికదళాధిపతి దల్బీర్ సింగ్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో జనరల్ జాకోబ్ కీలక పాత్ర పోషించారు.