జాతిపితకు ఘనంగా నివాళి

4

జాతిపితకు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,జనవరి30(జనంసాక్షి):  జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు జాతి నివాళి అర్పించింది. దేశరాజధానితో పాటు పలుప్రాంతాల్లో ఆయనకు నివాళి అర్పించారు.  పలవురు ప్రముఖులు రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ తదితరులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్ముడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్‌ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బాపూజీ 67వ వర్థంతిని పురస్కరించుకుని ట్విట్టర్‌ ద్వారా ప్రధాని నివాళులర్పించారు.మహాత్ముడితో పాటు, దేశ స్వాత్రంత్య్రం కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు బాపూ ఘాట్‌ను సందర్శించి మహాత్ముడికి  నివాళులర్పించారు.  జాతిపిత మహాత్మగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని దేశవాసులు నేడు గాంధీజీకి ఘన నివాళి అర్పించారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర వాహనదారులు గాంధీజీకి నివాళులర్పించారు.