జాతి నిర్మాణంలో ఉన్నాం
– రాజకీయాలు పక్కనపెడదాం
– లక్ష్యసాధనవైపు దూసుకెళ్దాం
– నిజామాబాద్ అభివృద్ధి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
నిజామాబాద్,ఏప్రిల్ 1(జనంసాక్షి): ప్రస్తుతం మనం తెలంగాణ జాతి నిర్మాణదశలో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.దీనిని సాధించడం కోసం పార్టీలకతీతంగా రాజీయలను పక్కన పెట్టి ముందుసాగుదామని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు.నిజామాబాద్ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ జడ్పీ విూటింగ్ హాల్లో జిల్లా అభివృద్ధిపై సవిూక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో పాతపద్దతిలో, మూస పద్దతిలో ముందుకు పోతే లక్ష్యాలను చేరుకోలేమని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సరిగా అమలు అయ్యేలా చూడాలని, అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని, గత ప్రభుత్వాల్లా పనిచేస్తే నడవదని కేసీఆర్ అన్నారు. పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గెలిచి నిలవాలని అధికారులకు ఆయన సూచించారు. కొత్త రాష్ట్రమైనా బాగా పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కితాబిచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మిషన్ భగీరథ పనుల్లో అలసత్వం వద్దు అని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథకు సంబంధించిన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైపులైన్లు వెళ్లే రైతుల పొలాల్లో ఈ నెల 31 లోపు పనులను పూర్తి చేయాలన్నారు. రైతులు విత్తనాలు వేసిన తర్వాత పంటపొలాల్లో పైపులైన్లు వేయొద్దన్నారు. పంటలను చెడగొట్టి రైతులకు ఇబ్బందులు కలగజేయొద్దని సూచించారు. పైపులు వేయాల్సి వస్తే వారిని సంప్రదించి ఒప్పించాలని, అవసరమైతు ప్రజాప్రతినిధుల సాయం తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ కోసం అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మద్దతు తీసుకుని ముందుకు పోవాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు కూడా రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల కోసం పని చేయాలన్నారు. అధికారులకు సహకరించాలని తెలిపారు. సమస్యను కాంప్లికేట్ చేసుకోవద్దు, అందరూ సమన్వయంతో ముందుకెళ్తే అనుకున్న సమయంలో పనులు పూర్తి అవుతాయన్నారు. అప్పుడప్పుడు కలెక్టర్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనులపై చర్చించాలన్నారు. సమావేశాల్లోను సగం పనులు అయిపోతాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కరువు ఉంది.. ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూపాయి ఖర్చు లేకుండా నిజాం సాగర్‌ను నింపుకోవచ్చని తెలిపారు. నిజాంసాగర్ కింద ఉన్న కాల్వలు పాడైపోయాయి.. వాటిని మరమ్మతు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ మంచి పనులు చేశారు. కొందరు విూపై దుష్పచ్రారం చేశారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని అధిగమించిందని ప్రశంసించారు. రాష్టాభ్రివృద్ధి కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని కేంద్రం ప్రశంసించిందని సిఎం అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలి. రాష్టాన్రికి మంచి అభివృద్ధి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పని చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. వనరులను, నిధులను సద్వినియోగం చేసుకోవాలి. మనమందరం జాతి నిర్మాణ పక్రియలో ఉన్నాం. ఉన్నంతలో చాలా జాగ్రత్తగా, చక్కగా నిధులు ఖర్చు చేసుకుని ముందుకు పోవాలని హితబోధ చేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా పని చేస్తే కుదరదు. ఇప్పుడు కొంచెం స్పీడ్‌గా పనులు చేయాలన్నారు.
ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రూ. 10 కోట్లు, మంత్రుల వద్ద రూ. 25 కోట్లు ఉంచాం. ఎక్కడికక్కడనే నిర్ణయం జరిగి పనులు జరగాలనే ఉద్దేశంతోనే కలెక్టర్లు, మంత్రులు వద్ద నిధులు ఉంచాం. అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి. ఇగోస్ పెట్టుకోవద్దని కలెక్టర్లకు చెప్పాను. ఇద్దరు అధికారులపై అరిస్తే గొప్పవాళ్లమవుతామని ప్రజాప్రతినిధులు భావించొద్దు. అధికారులతో కొందరు ప్రజాప్రతినిధులు ఎటుపడితే అట్ల మాట్లాడం మానుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఎనర్జీతో ముందుకు పోవాలి. నెగెటివ్ ఎనర్జీలో పని ముందుకు సాగదన్నారు. అరుచుకోవడం, కరుచుకోవడం మానుకొని తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకెళ్లాలని సీఎం సూచించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ప్రస్తుతం మనం జాతి నిర్మాణ పక్రియలో ఉన్నాం.. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల కోసం చేయాలి. అన్ని అడ్డంకుల్ని తొలగించుకుంటూ సమష్టి కృషితో ముందుకు అలాగైతేనే అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందని అధికారులకు ఉద్బోధించారు. ఉన్నంతలో నిధులు ఖర్చుచేసి అభివృద్ధి పనులు సాధించుకోవాలన్నారు. అధికారులు ఇగోలకు పోకుండా సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతా కలిసి బండికి చక్రాల్లాగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. /ుల్లాలో సీనియర్ మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారి అనుభవాలను రంగరించుకొని అధికారులు ముందుకెళ్లాలని సూచించారు. మంచి నాయకత్వం ఉన్నచోటే మంచి కార్యక్రమాలు సాధ్యమవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాలు.. ప్రజల ఆకాంక్షలను తప్పకుండా చేరుకోవాలని ఆయన అన్నారు. సాధించుకున్న తెలంగాణలో గెలిచి నిలవడం కోసం కృషిచేయాలన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు తన పరిధిలోనూ ఉన్నాయని, వాటిని జిల్లా అభివృద్ధికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టులు వట్టిపోయాయన్నారు. రావాల్సిన ప్రాజెక్టులు రాకపోవడంతో పర్యావరణ సమతౌల్యత దెబ్బతిందని తెలిపారు. ప్రాజెక్టులు లేక నీరు అందని స్థితిలో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. కరవు ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం కోసం మిషన్ భగీరథను పెట్టుకున్నామన్నారు. మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమని, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపి కవిత, కలెక్టర్ యోగితారాణా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఇందూరు వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీర్ దంపతులు దర్శించుకున్నారు. స్వామి వారికి సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి కల్యాణ మ¬త్సవంలో సీఎం దంపతులు, ఎంపీ కవిత, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇందూరు వెంకటేశ్వరస్వామి ఆలయానికి విచ్చేశారు. అక్కడ ఆయనకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం దంపతులు శ్రీవేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కూతురు, ఎంపీ కవితతోపాటు ఎంపీ బీబీ పాటిల్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఇందూరులో చక్కటి ఆలయాన్ని నిర్మించిన దిల్‌రాజుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అద్భుతమైన ఆలయాన్ని కరసేన ద్వారా నిర్మించిన గ్రామస్తులందరినీ సీఎం అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాలో ఈ ఆలయం ఉందన్నారు. గతంలో ఈ ఆలయానికి రాలేకపోయాను అని పేర్కొన్నారు. ఇకపై ఇటువైపు వచ్చినప్పుడు ఇందరూ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్తానని చెప్పారు. ఇక వందశాతం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తామని ముందుకొచ్చిన నర్సింగ్‌పల్లి గ్రామానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం సాయం అందిస్తామన్నారు. నర్సింగ్‌పల్లి ఒక ఆదర్శగ్రామంగా వెలుగొందాలని చెప్పారు. నర్సింగ్‌పల్లి గ్రామస్తులు కోరినవన్నీ తక్షణం మంజూరు చేయిస్తానని తెలిపారు.




