జాతీయ ఓటరు దినోత్సవాన ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్,జనవరి22(జనంసాక్షి): జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న ఓటరు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఎన్‌ఇనకల సంఘం సన్నాహాలు చేస్తోంది. జిల్లా స్థాయిలో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదును ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా యువత ఓటులో పాల్గొనేలా చేయడంతో పాటు నమోదుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించి వారు తమ ఓటును సద్వినియోగం చేసుకునేలా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. భావి ఓట్లంల్గ/న విద్యార్థులకు ఓటు ఆవశ్యకతను వివరించేందుకు ఇప్పటికే పాఠశాల, ఇంటర్ స్థాయిలో జూనియర్లకు, అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచి సీనియర్లకు విడివిడిగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఓటు వేసేందుకు సిద్ధం’ నినాదంతో బ్యాడ్జీలు రూపొందించారు. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు నమోదైన పోలింగ్ కేంద్రాల్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పాల్గొంటారు. ప్రజలతో జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేయిస్తారు. అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.ఓటరు నమోదు పక్రియను సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తు న్నారు. దివ్యాంగులు, పరిమిత విభాగాల వారికి అందుబాటులో ఎన్నికలు అంశంపై జూనియర్లకు, సక్రమ, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహణ-భాగస్వాముల, ఎన్నికల యంత్రాంగం పాత్ర-పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు అంశంపై వ్యాసరచన, వ్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. గెలుపొందిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఓటర్ల దినోత్సవం రోజున అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో కార్యక్రమాలు చేపడుతారు. అసెంబ్లీ, జిల్లా కేంద్రంలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, నెహ్రూ యువకేంద్రం, మాజీ సైనికోద్యోగుల భాగస్వామ్యంతో ర్యాలీలు, మానవహారాలు, మారథాన్ పరుగు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నూతనంగా ఓటుహక్కు పొందిన వారికి ఫొటో గుర్తింపు కార్డులు పోలింగ్ కేంద్రాల్లో అందజేస్తారు. ‘