జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం
టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌దే కీలక భూమిక
కాంగ్రెస్, బిజెపిలను ప్రజలు నమ్మరు
అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): ఎన్నికలకు ముందే జాతీయ రాజకీయాల్లో మార్పులు వస్తాయని, ఎన్‌ఇనకల తరవాత కేంద్రంలో టిఆర్‌ఎస్ కీలక భూమిక పోషించనుందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి డ ఆక్టర్ ఎస్. వేణుగోపాలచారి అన్నారు. ప్రజలు కాంగ్రెస్,బిజెపిలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. సిఎం కెసిరా/- ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రభావం వల్లనే యూపిలో ఎస్పీ, బిఎస్పీ కాంగ్రెస్‌ను దూరం పెట్టాయన్నారు. ఇది కెసిఆర్ విధానాలరు అనుగుణంగా జరిగిందని గురువారం నాడిక్కడ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కిందని చారి అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు లేకుండా కేంద్రంలో ఉమ్మడి పాలన రావాల్సి ఉందని, రాష్ట్రాలకు ప్రాధాన్యం పెరగాల్సి ఉందన్నారు. ఈ రకమైన ఆలోచనతో సిఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తోందని అన్నారు. ఏదో ఒక ఫ్రంట్‌లో చేరక తప్పదన్న ఎపి సిఎం చంద్రబాబు ప్రకటనలో అర్థం లేదన్నారు. అసలా బానిసభావమే సరికాదన్నారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని అడ్డుకునే అధికారం ఉండరాదన్నారు. చిన్నచిన్న విషయాల్లో కూడా కేంద్ర పెత్తనం భరించలేనిదిగా ఉందన్నారు. రాష్ట్రంలో ఐకెసిఆర్ అభివృద్ది నమూనా చూసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ముందుకొస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన తీరుతో రెండోసారి కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారని, మంచి పనులు చేస్తే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా పార్టీ దూసుకుని పోతోందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్‌ఇనకల్లోనూ ఏకపక్షంగా ప్రజలు కెసిఆర్‌కు పట్టం కడతారని చారి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలపై దృష్టి సారించిందని, అందులో భాగంగానే రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు వివరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలు గెలవటంతో పాటు కేంద్రంలో టీఆర్ ఎంపీల దయాదాక్షిణ్యాల పై పార్లమెంటు ఉండబోతున్నదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేపట్టని ప్రాజెక్టులు చేపట్టి కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కెసిఆర్ చేస్కతున్న కృషి కారణంగా రాఉన్న రోజుల్లో తెలంగాణ ముఖచిత్రం మారనుందని అన్నారు. రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిందని, రెండో విడతలో కూడా పూర్తి స్థానాలు టీఆర్ వశం కాబోతున్నాయన్నారు. గెలుపే లక్ష్యంగా టీఆర్ సర్పంచ్, వార్డు సభ్యులు ముందుకు సాగాలని నిర్దేశిరచారు.