జాతీయ విద్యా విధానం 2020, సెమినార్ లో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ డాక్టర్ డి.మంజునాథ్
కంటోన్మెంట్, జనం సాక్షి జూలై 27 కేంద్రీయ విద్యాలయం ద్వారా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సులభతరంగా విద్యార్థులను ఉన్నత ప్రమాణాలతో ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్ ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ డి.మంజునాథ్,ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కే.రమేష్,ఇగ్నో డైరెక్టర్,ఎ.అనిల్ కుమార్,కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ టి. ప్రభుదాస్,జిల్లా విద్యాశాఖాధికారి సీబీఎస్ఈ సిటీ కోఆర్డినేటర్ సునీత రావు,కేంద్రీయ విద్యాలయం బేగంపేటఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రిన్సిపల్ ఆర్. శంకర్,కేంద్రీయ విద్యాలయ పికెట్ ప్రిన్సిపాల్ రూపిందర్ సింగ్, మొదలగువారు వివరించారు. ఈ సందర్భంగా 3వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ విద్యా విధానము ప్రవేశపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథి పాల్గొన్న డాక్టర్ డి.మంజు నాథ్ మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020,నిపున్ భారత్, టాయ్ బేస్డ్ పెడాగోగి,బాల్ వాటికా, జాదుయి పితర, టీచర్ ట్రైనింగ్,నిష్ఠా,దీక్ష మరియు ది నేషనల్ ఫ్రేమ్‌వర్క్ గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క దీక్షలు మరియు విజయాలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క సహకారం దేశీయ సంస్కృతిని తీసుకువచ్చింది, కేంద్రీయ విద్యాలయంలో చిన్నపిల్లల నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు ఇంటర్ వరకు విద్యార్థులను ఉన్నత విద్యారంగంలో జాతీయ విద్యా విధానం రూపొందించామని తద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆధునిక విద్యా విజ్ఞానాన్ని సులభతరంగా వారికి అందించేందుకు విద్యా ప్రమాణాల పెంపొందించి వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరుకునేలా తీర్చిదిద్దామన్నారు.కులం, మతం స్థానం లేదా లింగంతో సంబందం కుండా పిల్లలందరికి పోల్చదగిన నాణ్యత గల విద్య అందించడానికి ఐదు ముఖ్య సూత్రాలు పై ఆధార పడి ఉంటుంది యాక్సెస్, ఈక్సిటీక్వాలిటీ,ఆఫర్థబిలిటీ, అకౌంట్ బులిటీ విద్యా వ్యవస్థను మార్చ క్రొత్త విద్యావిధానం 2020 యొక్క ధ్యేయం, ఆధునిక బోధనా పద్ధతులను తీసుకురావడం సాంకేతికత యొక్క శక్తిని స్వీకరించడం మరియు ఆత్మకి ఆధారంగా అభ్యాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్న విధనాత్మక విధానం వారిందా పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికి విద్యను అందుబాటులో ఉంచడమే అట్టడుగు వర్గాలకు మద్దతు ఇవ్వడం మరింత సమరమైన మరియు న్యాయమైన విద్యా వాతావరణాన్ని సృష్టించడంపై ప్రత్యేక కొత్త విద్యా విధానం విప్ల నాత్మకత విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై బలమైన దృష్టిని మరియు డిజిటర్ వాతావరణాన్ని సృష్టించడం, మరియు విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించాలని నిర్దేశిస్తుంది.మూడు నెలల కాలంలో విద్యార్థులు ఇంటి ధ్యాస మర్చిపోయి పాఠశాలకు అంకితమై స్కూల్ జీవితానికి అలవాటు పడేలా చేస్తున్నామని అదేవిధంగా వృత్తివిద్య డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తదితరాంశాలలో నూతన విద్యార్థులకు విద్యా ప్రమాణాలు నేటి ఆధునిక సమాజానికి దీటుగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తున్న మార్పులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఆధునిక టెక్నాలజీ విధానములో ఏ విధంగా విద్యను అవలంబిస్తున్నది ఆ విభాగం అధికారి రమేష్ వివరించారు. అదేవిధంగా అధికారులు సునీత రావు,ప్రాథమిక విభాగం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ వస్తువులు ను ఎగ్జిబిషన్ సెమినార్ ప్రదర్శించారు,ఈ కార్యక్రమంలో
ఆతిథ్య పాఠశాల మరియు కేంద్రీయ విద్యాలయ ఇతర ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.