జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణ కు ఘనంగా ఏర్పాట్లు*.

నల్గొండ బ్యూరో, జనం సాక్షి. ఈ నెల 16,17,18 తేదీ లలో జాతీయ సమైక్యతా వజ్రొత్సవాలు నల్గొండ నియోజక వర్గం లో,జిల్లా కేంద్రంలో ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ ఆదేశాల ననుసరించి  ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నల్గొండ అర్.డి. ఓ.,నల్గొండ నియోజక వర్గ ప్రత్యేక అధికారి జగన్నాథ రావు అన్నారు శుక్రవారం అర్.డి. ఓ కార్యాలయం లో డి.ఈ. ఓ., డి.పి.అర్. ఓ తో కలిసి  నల్గొండ నియోజక వర్గ ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు  తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 న నల్గొండ జిల్లా,నియోజక వర్గ కేంద్రం లో 15 వేల మందితో ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని,ఇందుకు గ్రామ,మండల వారీగా యువత,ప్రభుత్వ ఉద్యోగులు,మహిళలు,విద్యార్థులు జిల్లా కేంద్రం ర్యాలీ కి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని,ఇందుకు కావలసిన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.మండల స్థాయి ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.నల్గొండ పట్టణం లో లక్ష్మి గార్డెన్ నుండి ఎన్.జి.కళాశాల వరకు ర్యాలీ వుంటుందని,ఎన్.జి.కళాశాల లో సమావేశం వుంటుందని అన్నారు.ర్యాలీ సంబందించి వేదిక,సౌండ్ సిస్టం,పారిశుధ్యం మున్సిపల్ శాఖ ఏర్పాటు చేస్తుందని అన్నారు. అక్కడే వారికి భోజనం ఏర్పాట్లు చేసేందుకు కౌంటర్ లు ఏర్పాటు చేయనున్నట్లు,కౌంటర్ వారీగా ఇంఛార్జి నియమించ నున్నట్లు తెలిపారు.17 న ముఖ్య అతిథి చే జాతీయ పతాక ఆవిష్కరణ వుంటుందని, అదే రోజు ఎస్.టి. ప్రజా ప్రతినిధులు,అధికారులు హైద్రాబాద్ లో ఎన్.టి.అర్.స్టేడియం లో జరిగే కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు బస్సు లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.సెప్టెంబర్ 18 న జిల్లా కేంద్రం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన,స్వాతంత్ర్య సమరయోధులు,కళాకారులకు సన్మానం వుంటుందని అన్నారు ఈ సమావేశం లో డి. ఈ. ఓ.బిక్షపతి,డి.పి.అర్. ఓ.శ్రీనివాస్, కనగల్ , తిప్పర్తి ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు,రెవెన్యూ ,విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు