జాబిలిపై నీరు
పారిస్,అక్టోబరు 27(జనంసాక్షి):చంద్రుడిపై శాస్త్రవేత్తలు భావిస్తున్నదానికంటే చాలా ఎక్కువ నీరు ఉండవచ్చు. సోమవారం ప్రచురితమైన రెండు అధ్యయనాల ప్రకారం.. భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై రిఫ్రెష్మెంట్ అవడమే కాకుండా ఇంధనం కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దశాబ్దం క్రితం వరకు చంద్రుడు పొడిగా ఉన్నట్లు భావించారు. ఇటీవల నాసాకు చెందిన ‘సోఫియా’ పంపిన చిత్రాలతో చంద్రుడి ఉపరితలంలో అనుకున్నదానికంటే ఎక్కువ నీటి జాడలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.నేచర్ ఆస్ట్రానవిూలో సోమవారం ప్రచురించిన రెండు కొత్త అధ్యయనాలు.. చంద్ర ధృవ ప్రాంతాలలో శాశ్వత నీడతో కూడిన ”కోల్డ్ ట్రాప్స్” లో నిల్వ చేయబడిన మంచుతోపాటు గతంలో అనుకున్నదానికంటే ఎక్కువ నీరు ఉండవచ్చని సూచిస్తున్నాయి. మునుపటి పరిశోధనలు ఉపరితలం స్కాన్ చేయడం ద్వారా నీటి సూచనలను కనుగొన్నది. కానీ, ఇవి నీరు, హైడ్రాక్సిల్, ఒక హైడ్రోజన్ అణువు, ఒక ఆక్సిజన్ అణువుతో తయారైన అణువుల మధ్య తేడాను గుర్తించలేకపోయాయి. అయితే, కొత్త అధ్యయనం సూర్యరశ్మి ప్రాంతాలలో కూడా చంద్రుడు పరమాణు నీటిని కలిగి ఉన్నదని మరింత రుజువును అందిస్తున్నది.న్ఫ్ఫ్రారెడ్ ఆస్ట్రానవిూ స్ట్రాటోస్పిరిక్ అబ్జర్వేటరీ (సోఫియా) వాయుమార్గాన టెలిస్కోప్, డేటాను ఉపయోగించి.. పరిశోధకులు చంద్రుడితీ ఉపరితలాన్ని ఇంతకుముందు ఉపయోగించిన దానికంటే ఖచ్చితమైన తరంగదైర్ఘ్యం వద్ద స్కాన్ చేశారు. ఇది పరమాణు నీటి స్పెక్ట్రల్ వేలిముద్రను నిస్సందేహంగా వేరు చేయడానికి వీలు కల్పించిందని హవాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ ప్లానెటాలజీ సహరచయిత కేసీ ¬నిబాల్ చె ప్పారు. నీరు గాజు పూసలలో చిక్కుకుపోయి ఉండవచ్చని లేదా కఠినమైన చంద్ర వాతావరణం నుంచి రక్షించే మరొక పదార్ధం అని పరిశోధకులు భావిస్తున్నారు. నీరు ఎక్కడి నుండి వచ్చాయో, ఎలా నిల్వ చేయబడిందో బాగా అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశీలనలు సహాయపడతాయని ¬నిబాల్ అన్నారు. కొన్ని ప్రదేశాలలో నీరు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించినట్లయితే.. దానిని తాగునీరు, శ్వాసక్రియకు ఆక్సిజన్‌గా, రాకెట్ ఇంధనంగా ఉపయోగించవచ్చునని ¬నిబాల్ చెప్పారు.