జావద్ తుఫాన్ ఎఫెక్ట్
పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటన
భువనేశ్వర్,డిసెంబర్2(( జనం సాక్షి )): జావద్ తుపాను ఎఫెక్ట్ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 95 రైళ్లను రద్దు చేసింది.సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్, త్రివేండ్రం శాలీమార్, బెంగుళూరు కంటోన్మెంట్` గౌహతి, అహ్మదాబాద్`పూరి ఎక్స్ప్రెస్, కన్యాకుమారి` దిబ్రఘర్శుక్రవారం రద్దు చేసిన రైళ్లుపూరి` గుణుపూర్, భువనేశ్వర్`రామేశ్వరం, హౌరా`సికింద్రాబాద్ పలకనామ ఎక్స్ప్రెస్, పూరి`యశ్వంత్పూర్ గరీబ్ రథ్, హౌరా`యశ్వంత్ పూర్`దురంతో, భువనేశ్వర్`ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, పురిలీయా`విల్లుపురం ఎక్స్ ప్రెస్, పురీ`తిరుపతి, హౌరా`హైదరాబాద్ `ఈస్ట్ కోస్ట్, హౌరా`చెన్నై కోరమండల్, హౌరా`మైసూర్ వీక్లీ, సంత్రాగాచ్చి`చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్ ప్రెస్, హౌరా`యశ్వంత్ పూర్, హౌరా`చెన్నై మెయిల్, పాట్నా`ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, రాయగఢ్`గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్`నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా`విశాఖ.ధన్ బాద్`అలిప్పీ, టాటా`యశ్వంత్ పూర్, పూరీ`అహ్మదాబాద్, భువనేశ్వర్`జగదల్పూర్, చెన్నై సెంట్రల్`హౌరా, హైదరాబాద్`హౌరా, చెన్నై`భువనేశ్వర్, 1226 యశ్వంత్ పూర్`హౌరా`దూరంతో, సికింద్రాబాద్`హౌరా`ఫలక్ నుమా, తిరుపతి`పూరీ, యశ్వంత్ పూర్`హౌరా, సికింద్రాబాద్`భువనేశ్వర్`విశాఖ ఎక్స్ప్రెస్, చెన్నై`హౌరా, వాస్కో`హౌరా, తిరుచురాపల్లి`హౌరా, బెంగళూర్`భువనేశ్వర్, ముంబై`భువనేశ్వర్, విశాఖ`కొర్బా, విశాఖ`రాయగఢ్, గుంటూరు`రాయగఢ్, జగడల్ పూర్`భువనేశ్వర్, జునాఘర్ రోడ్`భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.