జియోకు 50 మిలియన్ల వినియోగదారులు

25in_ambani_1247594fఫేస్‌బుక్‌, వాట్సాప్‌, స్కైప్‌లకంటే వేగంగా జియో అభివృద్ధి ఉందని రిలయెన్స్‌జియో అధినేత ముఖేష్‌ అంబానీ అన్నారు. అత్యంత వేగంగా సాంకేతికను అందించే సంస్థ జియో అని ఆయన చెప్పారు. సలహాలు, సూచనల కోసమే లాంచింగ్‌ ఆఫర్‌ ఇచ్చామని ఆయన చెప్పారు. కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకువచ్చామని ఆయన అన్నారు. 50 మిలియన్ల వినియోగదారుల సంఖ్యను జియో అధిగమించిందని ముఖేష్‌ అంబానీ చెప్పారు.ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉచిత ఫోన్‌ కాల్‌ సేవలు అందిస్తామని ముఖేష్‌ అంబానీ చెప్పారు. జియో వినియోగదారులకు ఇతర నెట్‌ వర్క్‌లు సహకరించడం లేదని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఉచిత ఫోన్‌ కాల్‌ సేవలందిస్తామన్నారు. నెంబర్‌ పోర్టబులిటీని స్వీకరించడానికి జియో సిద్ధంగా ఉందని ముఖేష్‌ అంబానీ చెప్పారు. నెంబర్‌ పోర్టబులిటీనివినియోగదారులకు అందిస్తామని ఆయన అన్నారు.డిసెంబర్‌ 31నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్‌ సౌలభ్యం కలుగజేస్తామన్నారు. 2017 మార్చి 31 వరకూ ఫ్రీ డేటా సర్వీస్‌ అందిస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు మంచి నిర్ణయమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఆయన అభినందించారు.