జిల్లాకు చేరిన విశ్వరూప మహా పాదయాత్ర.

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం.
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.
ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహా పాదయాత్రలో మందకృష్ణ మాదిగ.

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో,జనంసాక్షి:
ఎస్సీ- ఏ, బి, సి, డి వర్గీకరణ తోనే మాదిగ మరియు మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతున్నదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.శుక్రవారం మంద కృష్ణ మాదిగ తలపెట్టిన విశ్వరూప మహా పాదయాత్ర నాగర్ కర్నూల్ జిల్లాకు చేరుకున్నది.గత 39 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న పోరాటాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని,ఏ,బి,సి,డి వర్గీకరణ లేకపోవడం వల్ల విద్యావంతులైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి రాజ్యాంగపరంగా రావలసిన రిజర్వేషన్లు అందడం లేదని అన్నారు.వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఎస్పీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.ఆయన అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన మాదిగ విశ్వరూప పాదయాత్ర శుక్రవారం నాగర్ కర్నూల్ చేరుకున్నది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత పదవులు ఉన్న మాలలు ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు రెక్కలు తప్ప ఆస్తులు లేని మాదిగల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష కనబరుస్తున్నారని ఆయన మండిపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు అడుగని అనేక పథకాలను ప్రవేశ పెడుతూ ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్న ఏబిసిడి రిజర్వేషన్లపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ విషయమై దాటవేత ప్రదర్శన చేస్తుందని ఆయన అన్నారు.రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అక్కడ బిల్లు పాస్ చేయాల్సిన పాలకులు మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలకు అవసరం లేని కార్మిక చట్టాలు రైతు చట్టాలు 370 ఆర్టికల్ వంటివి అమలు చేస్తూ అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.ఇప్పటికైనా మా మాదిగ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వెంటనే పార్లమెంటులో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ ఎఫ్ ఎం జె ఎఫ్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనుబంధ సంఘాలు పాల్గొన్నారు.