జిల్లాపరిషత్‌లో పాముల భయంతో తెరవని రికార్డుల గది
ఖమ్మం, డిసెంబర్ 12 : జిల్లా పరిషత్ కార్యాలయంలో విలువైన రికార్డులు ఉన్న గదిలో పాములు ఉన్నాయని ఉద్యోగులు ఆ గది తెరిచేందుకు భయపడుతున్నారు. దీంతో కొన్ని నెలలుగా ఈ గది తెరవడం మానేశారు. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన దస్త్రాలు, మిగతా ఉద్యోగులకు సంబంధించిన రికార్డులు ఈ గదిలోనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం తలుపుల కింది నుండి పాములు వెళ్తుండడం కొందరు అధికారులు చూశారు. ఆ రోజు నుండి గది తాళం తీయడం మానేశారని తెలిసింది. గదిలో పడేసిన బస్తాలు, మూటల మాటున పాము ఉంటుందేమోనని భయపడుతున్నారు. ఈ రికార్డు గ్రీవెన్స్‌డే నిర్వహించే సమావేశం మందిరం పక్కనే ఉండడం గమనార్హం.